28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మొక్కలు నాటుదాం.. పచ్చని పరిసరాలు నిర్మిద్దాం..

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని ఫలితంగా పచ్చని పరిసరాలను నిర్మించాలని మోర్తాడ్ ఏపీఓ శకుంతల అన్నారు. ఇంటి చుట్టూ పరిషత్ ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలియజేశారు. వన మహోత్సవంలో భాగంగా మోర్తాడ్ మండలంలోని డోన్ పాల్, దొనకల్, శెట్ పల్లీ , తిమ్మాపూర్, పాలెం, ధర్మోరా, గాండ్ల పేట్, వడ్యాట్ గ్రామాల్లో శుక్రవారం హోమ్ సీడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు రమేష్, ప్రవీణ్, చంద్రమోహన్, శంకర్, అక్షయ్, శ్రీనివాస్, నరేష్, హనుమాన్లు, సంతోష్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article