30.9 C
Hyderabad
Monday, August 3, 2026

18న సర్పంచ్ ల మహా ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి‌ యాదయ్యగౌడ్

 

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచుల పెండింగ్ బిల్లుల ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని 18న శుక్రవారం ఇందిరాపార్క్ లో తలపెట్టిన సర్పంచుల మహా ధర్నాకు హైదరాబాద్ సెంటర్ జోన్ డిప్యూటీ కమిషనర్  శిల్పవల్లి అనుమతి ఇచ్చారు. సర్పంచ్ ల బిల్లులు చెల్లించే విధంగా గాంధీ మార్గంలో శాంతియుతంగా ప్రభుత్వం పరిష్కరించే విధంగా సర్పంచులు ధర్న లో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి‌ యాదయ్యగౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చి 20 నెలల అయితున్న మా బిల్లులు ఇవ్వకపోవడంతో అనేకమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారని తెలిపారు. ‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్య సరైనది కాదని బిల్లులు చెల్లించి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. సర్పంచులు చేసే మా  ధర్నాకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు  మద్దతు తెలపాలని ఉపాధ్యక్షులు గుంటి మధుసూదన్ రెడ్డి,  ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కార్యదర్శి కేశబోయిన మల్లయ్య కోరారు.

More articles

Latest article