28.2 C
Hyderabad

ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ నంగి దేవేందర్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

వీడియో తీస్తూ లైవ్ పెట్టె ప్రయత్నం

అగ్రహించి చితికబాదిన  బీఆర్ఎస్  శ్రేణులు

వేల్పూర్, బతుకమ్మ : కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమం లో భాగంగా గల్ఫ్ సంక్షేమ సంఘం నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నంగి దేవేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో చొరబడి కార్యకర్తల చేతులో తన్నులు తిన్నాడు. వేల్పూర్ పట్టణ కేంద్రంలో 163 బీ ఎన్ యస్ యస్ అమలులో ఉండగా,ఎమ్మెల్యే ఇంటి చుట్టూ పోలీసుల పహార ఉండగా అందరి కన్నులు కప్పి ఎమ్మెల్యే ఇంట్లో తన అనుచరుడితో కలిసి చొరబడ్డారు. వారిద్దరు బీఆర్ఎస్ శ్రేణుల్లో కలిసిపోయి వారికి తెలియకుండా అక్కడ జరుగుతున్న విషయాలను కాంగ్రెస్ నాయకులకు లైవ్ పెట్టి వీడియో చూపించే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు పట్టుకొని చితికబాదారు.అంతలోనే అల్లరి శబ్దం విన్న ఎమ్మెల్యే పై అంతస్తూ నుండి చూసి ఆయన్ని ఏమనకండి వదిలేయండి అని శ్రేణులకు సూచించారు. దాంతో  నాయకులు వదిలేశారు.
అంతట్లో పోలీసులు వచ్చి జోక్యం చేసుకొని నంగి దేవేందర్ రెడ్డిని బీ ఆర్ యస్ కార్యకర్తల నుంచి ప్రొటెక్ట్ చేసి తీసుకెళ్లారు.నిషిద్ద సెక్షన్ అమలులో ఉండగా, పోలీసులు కాపాల ఉండగా ఎమ్మెల్యే ఇంట్లో చొరబడి వీడియో తీస్తూ లైవ్ పెట్టె ప్రయత్నం చేయడం అంటే పోలీసులు అధికార పార్టీ వారికి కొమ్ము కాస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ వ్యక్తిపై కేసు నమోదు చెయ్యాలని, సెక్షన్ అమలులో ఉండగా పోలీసుల ఆదేశాలను బేఖతార్ చేసిన ఆయన్ని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్  నాయకులు పోలీసులను డిమాండ్ చేశారు.

Nangi Devender Reddy breaks into MLA's house

More articles

Latest article