28.2 C
Hyderabad

కబ్జా కోరల్లో శిఖం భూమి

Must read

📰 Generate e-Paper Clip

  • పిట్లం పెద్ద చెరువు శిఖం భూమి కబ్జా

 

బతుకమ్మ, పిట్లం :  పిట్లం మండల కేంద్రంలోని పెద్ద చెరువులో చెరువు ఆయకట్టైన శిఖమ్ భూమిని కొందరు కొన్ని సంవత్సరాలుగా కబ్జా చేశారు. ఎకరాల కొద్ది శిఖం భూమిలో దర్జాగా పంటలు పండిస్తున్నారు. రెవెన్యూ అధికారులు చెరువుల దగ్గరికి వెళ్లిన దాఖలు లేవు. ఎవరు రారని ధీమాతో ఎకరాల కొద్ది భూమిని కబ్జా చేసి పంటలు పండిస్తున్నారు. అధికారులు నిద్రమత్తును వీడి ప్రభుత్వ భూమిగా మార్చి తీసుకోవాలని ఆయకట్టు రై తులు కోరుతున్నారు. గతంలో రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న కందారులు చెరువు ఆయకట్టును చూసేవారు. మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కూడా చెరువుల శిఖం భూములను దర్జాగా కబ్జా చేస్తూ పంటలు పండిస్తున్నారు. ఇకనైనా రెవెన్యూ శాఖలో ఉన్న ఆయా గ్రామాల్లో శిఖం భూమిని కాపాడాలని రైతులకు కోరుతున్నారు.

The land of the peak is in the grip of occupation.

More articles

Latest article