27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏనుగు వర్గానికి చెందిన వ్యక్తిపై పోచారం వర్గీయుల దాడి

Must read

📰 Generate e-Paper Clip


Srinivas Reddy sectarian attack on Ravinder Reddy sect person

. వాట్సాప్ మెస్సేజ్ కారణంగా ఘర్షణ

వర్ని, బతుకమ్మ:  వర్ని మండలంలోని వడ్డేపల్లిలో ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిపై ఎమ్మెల్యే పోచారంఏనుగు వర్గానికి చెందిన వ్యక్తిపై పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి దాడి చేశారు. ఇప్పటికే బాన్సువాడ రాజకీయ వాతావరణం వేడెక్కి ఉండగా, ఈ ఘటన అగ్గికి ఆజ్యం పోసినట్లైంది. కాంగ్రెస్ నాయకుడు భీమశంకర్ తమపై ఇష్టం వచ్చినట్లు వాయిస్ మెసేజ్ లు పెడుతున్నాడని గోపాల్ అనే వ్యక్తితోపాటు ఆయన కొడుకు మరి కొంతమంది కలిసి గురువారం రాత్రి భీమశంకర్ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారిని పక్కకు నెట్టి ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ లతో తిట్ల పురాణం సాగుతుండగా, చివరికి ఇది ఘర్షణకు దారితీసింది. బీమాశంకర్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి కాగా, దాడికి పాల్పడిన గోపాల్ పోచారం వర్గంలో ఉన్నారు. గ్రామంలో కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. బీమాశంకర్ పై పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్, అతడి కుమారులు,  వెలగపూడి జయంత్,  వెలగపూడి యశ్వంత్ (బన్నా), శ్రీనగర్ మాజీ ఉపసర్పంచ్ ముప్పవరపు అన్వేష్,  నెహ్రు నగర్ మాజీ సర్పంచ్ నాని బాబు శ్రీనగర్ మాజీ వార్డ్ మెంబర్ మేక రాజేశ్,  గంట వేణుచైతన్య అలియాస్ బాబి దాడి చేశారు. ఇదిలా ఉండగా అందరూ చూస్తుండగా  పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వ్యక్తుల్లో శ్రీనగర్ మాజీ సర్పంచ్ రాజు, శ్రీనగర్ గ్రామానికి చెందిన కోనేరు శ్రీకాంత్ ఉన్నారు. ఈ మేరకు బాధితుడు బీమాశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బీమాశంకర్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గీయులు కోరారు. లేనిపక్షంలో తాము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

More articles

Latest article