27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

 

కామారెడ్డి, బతుకమ్మ : ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ ల తో కలిసి ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి 95 అర్జీలు వచ్చినాయి. ఈ సందర్భంగా జిల్లా  కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆర్జి దారులకు న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article