29 C
Hyderabad
Monday, August 3, 2026

డాగ్ గోల్డీ ఇక లేదు

Must read

📰 Generate e-Paper Clip

Dog Goldie is no more

. కన్నుమూసిన పోలీస్ డాగ్

. ఎనిమిదేళ్లపాటు సేవలందించిన గోల్డీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖలో ఎనిమిదేళ్లపాటు సేవలందించిన డాగ్ గోల్డీ(మందుపాతరలను గుర్తు పట్టేది) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) బి.కోటేశ్వర్ రావు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించి పోలీస్ బ్యాండ్ తో అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ.. డాగ్ గోల్డీ 2016 బ్యాచ్ నుంచి విధులు నిర్వహిస్తోందన్నారు. రాష్ర్టపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్, అసెంబ్లీ, ఉప్పల్ స్టేడియం తదితరన డ్యూటీలు నిర్వహించడంతోపాటు అనేక పతకాలు, ప్రశంసాపత్రాలు పొందిందన్నారు.  గోల్డీ అంత్యక్రియల్లో ఆర్మ్డ్ రిజర్వు ఏసీపీ నాగయ్య, హోమ్ గార్డ్సు ఏసీపీ అరుణ్ కుమార్, రిజర్వు ఇన్స్ పెక్టర్స్ (అడ్మిన్) సతీశ్, ఎంటీవో తిరుపతి, వెల్ఫేర్ శ్రీనివాస్, జిల్లా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ హన్మంత్ రెడ్డి, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మనోహర్, సాయన్న, జగదీశ్, మోహన్, శ్రీకాంత్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article