డాగ్ గోల్డీ ఇక లేదు
. కన్నుమూసిన పోలీస్ డాగ్ . ఎనిమిదేళ్లపాటు సేవలందించిన గోల్డీ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసుశాఖలో ఎనిమిదేళ్లపాటు సేవలందించిన డాగ్ గోల్డీ(మందుపాతరలను గుర్తు పట్టేది) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం కన్నుమూసింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ (అడ్మిన్) బి.కోటేశ్వర్ రావు పుష్పగుచ్ఛాలతో నివాళులర్పించి పోలీస్ బ్యాండ్ తో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ మాట్లాడుతూ.. డాగ్ గోల్డీ 2016 బ్యాచ్ నుంచి విధులు నిర్వహిస్తోందన్నారు. రాష్ర్టపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, ఇవాంక ట్రంప్, అసెంబ్లీ, ఉప్పల్...