30.9 C
Hyderabad
Monday, August 3, 2026

కల్తీ కల్లు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైదరాబాద్, బతుకమ్మ : కల్తీ కల్లు తాగి నలుగురు మృతి చెందడం అత్యంత బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని హెచ్ఎంటీ కాలనీలో జరిగిన కల్తీ కల్లు ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ కల్లు బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కల్తీ కల్లు ఘటనలు పునరావృతం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. కల్తీ కల్లు పై చర్యల పేరుతో వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న గీత కార్మికులను వేధింపులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు.

More articles

Latest article