23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

పాముకాటుతో బాలుడు మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోపాల్:

పాముకాటుతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మోపాల్ మండలం గుండ్యా నాయక్ తాండలో జరిగింది. గ్రామానికి చెందిన బిఆర్ఎస్ యువ నాయకుడు నేనావత్ రెడ్డి కుమారుడు నేనావత్ వరుణ్ (14) కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించారు. రాత్రి పాము కుట్టడంతో బాలుడిని వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే వరుణ్ చనిపోయినట్లు వైద్యులు పరిక్షించి తెలిపారు. వరుణ్  జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ 8 వ తరగతి చదువుతున్నట్లు తెలిసింది. నేనావత్ రెడ్డికి వరుణ్ తో పాటు ఇద్ధరు కుతుళ్లు ఉన్నట్లు తెలిసింది. వరుణ్ పాము కాటు మృతి తో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి

More articles

Latest article