25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఐదో టౌన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఒకరిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం..  నిజామాబాద్ నగరంలోని 80క్వాటర్స్ కు చెందిన సాలుంకే రత్నదీప్ గంజాయికి అలవాటుపడి అధిక డబ్బుల సంపాదించాలనుకున్నాడు. తెలిసిన వారి దగ్గర గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నాడు. సమాచారం తెలసుకున్న పోలీసులు డ్రైవర్స్ కాలనీలో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతని వద్ద 5ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. గంజాయిని ఎవరైనా అమ్మిన లేదా కొన్న లేదా తాగిన వారిపై  కేసు లు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article