27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ, బతుకమ్మ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు మంగళవారం ప్రారంభయమ్యాయి.  ఈఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. మూల విరాట్  దుర్గమ్మను పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండతో అందంగా తీర్చిదాద్దారు. ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. దీంతో ఇంద్రకీలాద్రి హరితవర్ణంలో శోభిల్లుతోంది. ఆషాఢ సారె సమర్పణ బందాలు, శాకంబరీ దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక,అంతరాలయ దర్శనాలను అధికారులు రద్దుచేశారు.

Shakambari festival begins at Indrakiladri

Shakambari festival begins at Indrakiladri

More articles

Latest article