ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు

విజయవాడ, బతుకమ్మ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించే శాకంబరి ఉత్సవాలు మంగళవారం ప్రారంభయమ్యాయి.  ఈఉత్సవాలు జూలై 10వ తేదీతో ముగియనున్నాయి. మూల విరాట్  దుర్గమ్మను పండ్లు, ఎండు ఫలాలు, ఆకుకూరలు, కూరగాయలతో అలకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయల దండతో అందంగా తీర్చిదాద్దారు. ఆలయ అలంకరణ, కదంభం ప్రసాదం తయారీ కోసం దాదాపు 50 టన్నుల కూరగాయలు వినియోగించారు. దీంతో ఇంద్రకీలాద్రి హరితవర్ణంలో శోభిల్లుతోంది. ఆషాఢ సారె సమర్పణ బందాలు, శాకంబరీ దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు...