27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

స్కూటీ పై వెళ్తూ జారిపడ్డ వ్యక్తి .. తలమీదుగా వెళ్లిన లారీ

Must read

📰 Generate e-Paper Clip

అక్కడికక్కడే వ్యక్తి మృతి

కీసర మండలం రాంపల్లి క్రాస్ రోడ్ వద్ద ప్రమాదం

కీసర, బతుకమ్మ: స్కూటీ పై వెళ్తూ ఓ వ్యక్తి అదుపుతప్పి జారిపడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వస్తున్న లారీ అతని తల మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈఘటన మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి క్రాస్ రోడ్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. మృతుడిని నారపల్లికి చెందిన షేక్ బాసిత్ (41) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article