25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసుల అదుపులో పారిపోయిన ఖైదీ

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్‌ శివారులోని డిపార్ట్‌మెంటల్‌ పెట్రోల్‌ పంపులో పనిచేస్తూ పారిపోయిన ఖైదీని పట్టుకున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఈనెల 29న పెట్రోల్‌ పంపు నుంచి ఓ ఖైదీ పారిపోయిన విషయం తెలిసిందే. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సదరు ఖైదీ తిరుపతిలో ఉన్నట్లు సమాచారం అందడంతో బోధన్‌ పోలీసులు శుక్రవారం అక్కడికి తరలివెళ్లారు. ఈ మేరకు ఖైదీని అదుపులోకి తీసుకుని బోధన్‌ తరలించినట్లు సీఐ చెప్పారు. శనివారం కోర్టు ఎదుట హాజరుపర్చామని పేర్కొన్నారు. సదరు ఖైదీ వర్ని మండలం సైదాపూర్‌కు చెందిన జీవన్‌ కాగా.. గతంలో తన భార్యను చంపిన కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు.

More articles

Latest article