- హరే కృష్ణ, హరే రామ నామ సంకీర్తనలతో మారుమ్రోగిన పట్టణ పురవీధులు
భీమ్ గల్, బతుకమ్మ : జగత్రాక్షకుడు, జగన్నాయకుడు శ్రీ జగన్నాథుని రథయాత్రను ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం భీమ్ గల్ మండల కేంద్రంలో శోభయమానంగా నిర్వహించారు. రథయాత్ర కోసం కృష్ణ భక్తులు ప్రత్యేకంగా రథాన్ని ప్రత్యేకంగా తయారు చేసి, రంగు రంగుల పువ్వులు,ఆకులతో అలంకరించి ప్రభు శ్రీకృష్ణ విగ్రహ మూర్తిని రథం లో ఉంచారు. అనంతరం హరే రామ హరే రామ:హరే కృష్ణ హరే కృష్ణ అనే నామన్ని జపిస్తూ భక్తులు రథం వెంట నడిచారు. హరే కృష్ణ నామ సంకీర్తనతోపట్టణ పురావిధులన్నీ మారుమ్రోగాయి. ముఖ్యoగా మహిళ భక్తుల నాట్యం అందరిని అలరించింది. సాయంత్రము 4:00గంటలకుప్రారంభమైన ఈ రథ యాత్ర బడా భీమ్ గల్ చౌరస్తా అభయాంజనేయ మందిరం నుండి ప్రారంభమై,బస్ స్టాండ్ నుండి అంగడి బజార్, నందిగల్లీ, మీదుగా ముచ్కూర్ చౌరస్తా నుండి జె బి యన్ గార్డెన్ వద్ద రథ యాత్ర ముగిసింది. అనంతరం జె బి యన్ గార్డెన్ లో. ,ప్రముఖుల ప్రవచనాలు, కీర్తనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమం లో కృష్ణ భక్త మండలి సభ్యులు సిద్దబాలరాం ప్రభు, గంగసాగర్ ప్రభు, మారుతీ ప్రభు, పరమేశ చైతన్య దాస్ ప్రభు, ఘన శ్యాం ప్రభు, సంఖపని ప్రభు, సచిన్ ప్రభు, సనాతన ప్రభు, శివకుమార్ ప్రభు, లష్మినారాయణ ప్రభు, శ్రీనివాస్ ప్రభు బీజేపీ మండల అధ్యక్షులు అరె రవీందర్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వరనర్సయ్య, కాంగ్రెస్ నాయకులు అనంత్రావు, మహేష్, తదితరులు మహిళా భక్తులు పాల్గొన్నారు.
