శోభాయమానంగా శ్రీ జగన్నాథుని రథయాత్ర
హరే కృష్ణ, హరే రామ నామ సంకీర్తనలతో మారుమ్రోగిన పట్టణ పురవీధులు భీమ్ గల్, బతుకమ్మ : జగత్రాక్షకుడు, జగన్నాయకుడు శ్రీ జగన్నాథుని రథయాత్రను ఇస్కాన్ ఆధ్వర్యంలో శనివారం భీమ్ గల్ మండల కేంద్రంలో శోభయమానంగా నిర్వహించారు. రథయాత్ర కోసం కృష్ణ భక్తులు ప్రత్యేకంగా రథాన్ని ప్రత్యేకంగా తయారు చేసి, రంగు రంగుల పువ్వులు,ఆకులతో అలంకరించి ప్రభు శ్రీకృష్ణ విగ్రహ మూర్తిని రథం లో ఉంచారు. అనంతరం హరే రామ హరే రామ:హరే కృష్ణ హరే కృష్ణ అనే నామన్ని జపిస్తూ భక్తులు...