కామారెడ్డి, బతుకమ్మ : జిల్లా కలెక్టర్ తలమడ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్, మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా విజిట్ చేశారు. ముందుగా జడ్పీహెచ్ఎస్ లోని పదవ తరగతి గదిలో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు చేశారు. విద్యార్థులతోనే గణిత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. తర్వాత 9వ తరగతి, 7వ తరగతి గదులలో విద్యార్థుల తో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. ప్రభుత్వం ఉచితంగా యూనిఫామ్స్ ఇస్తున్నందున విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు యూనిఫామ్ వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 9వ తరగతి విద్యార్థిని ఉట్ల ఉషశ్రీ ఫిజిక్స్ లో చూపిన ప్రతిభకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సికింద్రాబాద్ రోటరీ క్లబ్ వారు అందజేసిన 30 రీడింగ్ టేబుల్స్ ప్రారంభించారు. అనంతరం ప్రైమరీ స్కూల్, జడ్పీ స్కూల్ విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ప్లేటు పట్టి భోజనం వడ్డించుకుని వారితో నేలపై కూర్చుని ఆహారం భుజంచి రుచి చూశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో 50వేల రూపాయలను మంజూరు చేస్తూ కిషన్ షెడ్ రిపేర్ చేయించుకోవాలని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు రమేష్ కుమార్ ను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవో రఘురాం, పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఆర్డీవో జ్యోతి, తాసిల్దార్ జానకి, మండల విద్యాధికారి పూర్ణచందర్, జడ్పీహెచ్ఎస్ హెడ్మాస్టర్ బిక్షపతి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

