27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అందుబాటులోకి మక్కలు ఆరబెట్టే యంత్రం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: భూమి దున్నడానికి, చదును చేయడానికి, వరి నాట్లు వేయడానికి, కలుపు తీయడానికి, మందు పిచికారి చేయడానికి ఇలా రకరకాలుగా యంత్రాలు వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు నూతనంగా మక్కలు ఆరబెట్టే యంత్రం అందుబాటులోకి రావడంతో రైతు ఎండ కోసమే ఎదురుచూసే పని లేకుండా ఆ బాధ నుంచి ఉపశమానం కలిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన గడ్డం రాజేందర్ అనే రైతు ఈ యంత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒక్కసారి 30 క్వింటాళ్ల మక్కలు ఆరబెట్టవచ్చని పేర్కొన్నారు. మొదటిసారిగా మోర్తాడ్ మండలం దొనకల్ గ్రామంలో యంత్రంను ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ యంత్రం ఖరీదు 9 లక్షల 50 వేల నుండి 10 లక్షల వరకు అవుతుందని పేర్కొన్నారు.

Cotton dryer available

More articles

Latest article