నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్ణాటక మాజీ గవర్నర్ గా వ్యవహరించిన కొణిజేటి రోశయ్య జయంతి, దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, , ఇతర అధికారులు, కలెక్టరేట్ లోని వివిధ శాఖల ఉద్యోగులు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిణి స్రవంతి, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఇతర అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

