29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన కవిత

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యశోద ఆస్పత్రికి వెళ్లి తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జ్వరం, మధుమేహ సంబంధిత సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన్ను కవిత పరామర్శించారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.  గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ప్రాథమిక పరీక్షల్లో షూగర్ లెవల్ అధికంగా , సోడియం స్థాయి తక్కువగా ఉన్నట్లు తేలింది. ఇవి సాధారణ స్థాయికి వచ్చే వరకు వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ చికిత్స పొందుతారని హెల్త్ బులెటిన్ లో డాక్టర్ ఎంవీరావు పేర్కొన్నారు. కాగా, కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై గురువారం రాత్రి సీఎం రేవంత్, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

More articles

Latest article