యశోద ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించిన కవిత
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత యశోద ఆస్పత్రికి వెళ్లి తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. జ్వరం, మధుమేహ సంబంధిత సమస్యలతో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయన్ను కవిత పరామర్శించారు. గురువారం సాయంత్రం అనారోగ్యంతో కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. ప్రాథమిక పరీక్షల్లో షూగర్ లెవల్ అధికంగా , సోడియం...