29 C
Hyderabad
Monday, August 3, 2026

డ్రగ్స్ నిర్మూలనకు ఎక్స్సైజ్, పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • విద్యార్ధి సేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ నాయక్

 

భీమ్ గల్, బతుకమ్మ: గంజాయి, డ్రగ్స్ కు యువత అలవాటుపడి నిండు జీవితాన్ని నాశనం చేసుకొంటున్నారని అలాంటి డ్రగ్స్, గంజాయిలను పూర్తిగా నిర్మూలించెందుకు గాను ఎక్స్సైజ్ శాఖ, పోలీస్ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్ధి సేన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ నాయక్ కోరారు. విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ వంద రోజుల మహోద్యమంలో భాగంగా గురువారం మండల కేంద్రంలో డ్రగ్ ఫ్రీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశానికి మూల స్థంబాలైనా యువత చెడు వ్యసానాల జోలికి వెళ్ళవద్దని, డ్రగ్స్, గంజాయి లాంటి వ్యసానాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థుల్లో మానసిక, శారీరక ఒత్తిడికి లోనుకాకుండా ఉండడానికి చదువు తో పాటు క్రీడలు అలవార్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రణయ్, వికాస్, అజయ్, సిద్దు,అంజి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article