25.3 C
Hyderabad
Tuesday, August 4, 2026

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న

Must read

📰 Generate e-Paper Clip

  • గాంధారి మండలంలో సొసైటీ వద్ద రాస్తారోకో

 

గాంధారి, బతుకమ్మ: గాంధారి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం వద్ద యూరియా అందించడం లేదని రైతులు, భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి లింకులు లేకుండా యూరియాను అందజేయాలని, యూరియా కుత్రిమ కొరత లేకుండా చేయాలని అధికారుల దృష్టికి ఎన్ని సార్లు తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదని అన్నారు. రైతులకు సరిపడే యూరియాను వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి లింకు లేకుండా యూరియాను అమ్మాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు పాల్గొన్నారు.

More articles

Latest article