27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మెడికల్ ఆఫీసర్ కు సమ్మె నోటీసు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగస్వాములవుతామని ఆశా కార్యకర్తలు రుద్రూర్  మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆయేషా సిద్ధిఖీకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా నాయకుడు నన్నేసాబ్ మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. లేబర్ కోడ్ లను రద్దు చేసి, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు భూలక్ష్మి, వాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ లతా, నాయకులు శోభ, లక్ష్మి, ప్రేమల, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article