26.6 C
Hyderabad
Monday, August 3, 2026

విజయ డెయిరీ జిఎంగా పి.శ్రీనివాస్

Must read

📰 Generate e-Paper Clip

ఇందూర్, బతుకమ్మ: నిజామాబాద్, కామారెడ్డి మిల్క్ షెడ్ జనరల్ మేనేజర్ గా పి.శ్రీనివాస్ బాద్యతలు స్వీకరించారు. ఇక్కడ ఉన్న జి.ఎం సిద్దిపేట్ కు బదిలీ అయ్యారు. అక్కడ ఉన్న జి.ఎం.ను కామారెడ్డికి బదిలీ చేసారు. గ్రామ స్థాయిలో పాల సేకరణ బారీగా తగ్గుతున్న దరిమిలా మిల్క్ షెడ్ లను కుదించాలని  అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగానే ప్రస్తుతం కామారెడ్డి లో ఉన్న మిల్క్ షెడ్ ను నిజామాబాద్ లో అంతర్భాగం చేస్తూ ఉత్తర్వులు జారి చేసారు. విధుల్లో చేరిన జి.ఎం.శ్రీనివాస్ డెయిరీ సిబ్బంది, కేంద్రాల నిర్వాహకులు, డిస్ట్రిబ్యూటర్ లతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా పాల సేకరణ తగ్గడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే విక్రయాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.

More articles

Latest article