28.8 C
Hyderabad
Monday, August 3, 2026

“బార్ “ను సందర్శించిన ఉన్నత విద్యా మండలి చైర్మన్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి మంగళవారం నిజామాబాద్ బార్ అసోసియేషన్ ను సందర్శించారు.ఉన్నత విద్యావంతుడైన ఆయన న్యాయశాస్త్రంలో నాల్సర్, మహేంద్ర యూనివర్సిటీ లలో ప్రొఫెసర్ గా పనిచేశారు. ఐక్య రాజ్యసమితి కి ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పెస్ లో విషయంలో రచనలు చేసి సమర్పించారు. ఈ సందర్బంగా న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ న్యాయవాద వృత్తి అత్యంత ఉన్నతమైనదని అన్నారు.చాలా అవకాశాలు ఉన్నాయని వాటిని అందిపుచ్చుకుని న్యాయవాద వృత్తిలో ఎదగాలని పేర్కొన్నారు. ప్రతి వివాదం చట్ట సంబంధం ఉంటుందని, వాటి పరిష్కారం కోసం న్యాయార్థులు న్యాయవాదులనే సంప్రదిస్తారని, న్యాయ విజ్ఞానంతో వాటికి పరిష్కారం చూపాలని అన్నారు. నిరంతర అధ్యయనంతో వృత్తిని దిగ్విణికృతం చేసుకోవాలని కిష్టరెడ్డి అన్నారు. న్యాయవాద మేధాశీలతకు, నైపుణ్యానికి, వృత్తి రచనాశైలికి పదును పెట్టుకుని పేరు ప్రతిష్టతలు సంపాదించుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి,తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు మంథని రాజేందర్ రెడ్డి,సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ రావు,ఆశ నారాయణ, సుదర్శన్ రెడ్డి,బార్ లైబ్రరీ కార్యదర్శి శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article