25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

రైతుకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: దేశానికి వెన్నెముక రైతు అని అటువంటి రైతుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి రైతును  రాజు చేయాలని రైతు భరోసా కల్పిస్తూ చేదోడు వాదోడుగా ఉంటుందని జిల్లా కార్యదర్శి గిర్మాజీ గోపి అన్నారు. మంగళవారం మోర్తాడ్ బస్టాండ్ లోని ప్రధాన కూడలి వద్ద రైతు భరోసా సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టుకొని బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం రైతు వేదికలో నాయకులు కార్యకర్తలు రైతులు అందరూ కలిసి సంబరాలు నిర్వహించారు. మోర్తాడ్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యాల రాములు, మండల యూత్ అధ్యక్షుడు మనోజ్, ఆనంద్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article