27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లగుట్ట గ్రామ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది, ఎస్ఐ గోవింద్ ఆధ్వర్యంలో దాడి చేసినట్లు పేర్కొనారు. ఈ దాడిలో ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి ఏడు సెల్ ఫోన్లు, రూ.102000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రూరల్ ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article