- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏఓకి వినతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలో కార్పొరేట్ ప్రభుత్వ అనుమతులను తుంగలో తొక్కి, జీవో నెంబర్ 1,10,92,42 లను ఉల్లంఘించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచి , పెంచిన ఫీజులను నోటీసు బోర్డులో పెట్టకుండా , నియమ నిబంధనలు ఉల్లంఘించి నడుస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రఘురాం, జిల్లా నాయకులు కుషాల్, నవిన్, సంజయ్, టోకు, సంతోష్, రమేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
