మోపాల్, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాలమేరకు సంస్థాగత నిర్మాణం కోసం మోపాల్ మండల పరిధిలోగల అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ నూతన గ్రామ కమిటీలను ఎన్నుకున్నారు. నూతన గ్రామ కమిటీలు ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలు లేనిచోట నూతన గద్దెలు నిర్మించి 31వ ఆవిర్భావ దినోత్సవన్నీ ఘనంగా నిర్వహించాలని అన్నారు. నూతన గ్రామ కమిటీల నిర్మాణంలో భాగంగా జిల్లా ఉపాధ్యాక్షులు రొడ్డ ప్రవీణ్ మాదిగ అధ్యక్షతన సంస్థాగత నిర్మాణం జిల్లా ఇన్ఛార్జ్ కూడల స్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగానే కులాస్ పూర్ గ్రామ కమిటీ అధ్యక్షులుగ డి.నర్సయ్య, ఉపాధ్యక్షులుగ జి.రవి, ప్రధాన కార్యదర్శిగ సాయిలు, కార్యదర్శిగా వెంకటేష్, ప్రచార కార్యదర్శిగా సురేష్, కార్యవర్గ సభ్యులుగా బాబు, ముత్తయ్య, సాయిలు, రగు, మహేందర్, బిమయ్యా, రవిందర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళ విభాగం జాతీయ నాయకురాలు పెద్దోళ్ల యమునా, ధమ్మడి గంగారాం, సంజీవ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

