యోగాతో మనిషికి శాంతి.. ప్రశాంతత

0 17,889

మోర్తాడ్,బతుకమ్మ: ప్రతిరోజు వ్యక్తి ఉదయకాలం యోగా చేయడం వల్ల మనిషికి శాంతి ప్రశాంతత మనసుకు నెమ్మది కలుగుతుందని ఆరోగ్య సూపర్వైజర్ మారుతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని మోర్తాడ్ మండలంలోని డొంకల్ గ్రామంలో ఉన్నటువంటి ఎంపీపీ ఎస్, జెడ్పిహెచ్ఎస్ పాఠశాలల్లో యోగ డే నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు వాటి యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. అలాగే విద్యార్థులకు కిటాక జనిత వ్యాదులపైన సీజనల్ వ్యాధులపైన, డైహారియా పైన, వ్యక్తిగత పరిశుభ్రత పైన పరిసరాల పరిశుభ్రత పైన అవగాహన  కల్పించారు. కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ అలేఖ్య, ఎంల్ హెచ్ పి దివ్య శ్రీ , హెడ్ మాస్టర్,టీచర్స్, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.