భీమ్ గల్, బతుకమ్మ : ప్రతిష్టాత్మక పసుపు బోర్డును జిల్లా కేంద్రంలో ప్రారంభించేందుకు గాను జిల్లాకు వస్తున్న కేంద్ర హాం శాఖ మంత్రి అమిత్ షా సభను సక్సెస్ చేసేందుకు గాను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశంను నిర్వహించారు. పట్టణం లో ఎల్ జే ఫంక్షన్ హాల్ లో పట్టణ అధ్యక్షులు కనికరం మధు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతు పట్టణం నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులను తరలించాలని అన్నారు. ఈ సభ సక్సెస్ ను పార్టీ ప్రతి నాయకుడు, కార్యకర్త తన భాద్యతగా తీసుకువాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ యోగేశ్వర నరసయ్య, జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు బండారి లక్ష్మణ్ గౌడ్, సీనియర్ నాయకులు సంధ్యా రాజు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్చార్జులు పాల్గొన్నారు.
