26.6 C
Hyderabad
Monday, August 3, 2026

వర్కింగ్ జర్నలిస్ట్ పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం ఇవ్వగా డీఈవో జర్నలిస్టుల పిల్లలకు 50 ఫీజులో రాయితీ ఇవ్వాలని విడుదల చేసిన కాపీని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టి డబ్ల్యూ జే ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి తమ యూనియన్ తరపు నుండి జిల్లా విద్యాశాఖ అధికారికి, కలెక్టర్కు వర్కింగ్ జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో  ఫీజులో 50 శాతం  రాయితీ ఇచ్చేలా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ ఒక్క విషయంలోనే కాకుండా జర్నలిస్టులకు వివిధ సంక్షేమ పథకాలపై సైతం తమ యూనియన్ ఆధ్వర్యంలో పోరాటాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జేఎఫ్ జాతీయ కౌన్సిల్ నెంబర్ కృష్ణమాచారి, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కృష్ణమూర్తి, డి, మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకర్, ఎలక్ట్రానిక్ మీడియా  కన్వీనర్ దశరథ్, జిల్లా ఉపాధ్యక్షులు జమాల్పూర్ లక్ష్మణ్, రాకేష్, లింగమాచారి, సభ్యులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article