26.2 C
Hyderabad
Monday, August 3, 2026

అనుమతులులేని స్కూల్స్, కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్:  బోధన్ పట్టణంలో అనుమతులు లేని స్కూల్స్, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సేన (బీవీఎస్) మండల విద్యాధికారికి (ఎం.ఈ.ఓ)  వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీవీఎస్ పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం మాట్లాడుతూ, “బోధన్ పట్టణంలో అనుమతుల్లేకుండా నడుస్తున్న కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటంాడుతున్నాయి. అలాంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో అక్రమంగా పుస్తకాలు, యూనిఫారాలు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం నేరంగా పరిగణించబడుతుందని, స్కూల్ మేనేజ్‌మెంట్‌లు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఫీజుల పేరుతో విద్యార్థులపై ఆర్ధిక భారం మోపుతున్న స్కూల్స్‌ను తక్షణమే పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీవీఎస్ డిమాండ్ చేస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ ఉపాధ్యక్షుడు ఎసోల్ల ఆకాష్, అరుణ్,  కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article