అనుమతులులేని స్కూల్స్, కాలేజీలపై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ, బోధన్:  బోధన్ పట్టణంలో అనుమతులు లేని స్కూల్స్, కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ విద్యార్థి సేన (బీవీఎస్) మండల విద్యాధికారికి (ఎం.ఈ.ఓ)  వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా బీవీఎస్ పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం మాట్లాడుతూ, “బోధన్ పట్టణంలో అనుమతుల్లేకుండా నడుస్తున్న కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటంాడుతున్నాయి. అలాంటి సంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం” అని తెలిపారు. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లో అక్రమంగా పుస్తకాలు, యూనిఫారాలు అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం...