30.9 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ నగర యాదవ సంఘం అధ్యక్షుడుగా విగ్నేష్ ( విక్కి) యాదవ్

Must read

📰 Generate e-Paper Clip

 

 నగర యాదవ సంఘ కార్యవర్గం ఎన్నిక

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:

నిజామాబాద్ నగర యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా విగ్నేష్ ( విక్కీ )యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. యాదవ సంఘం లో ఆదివారం జరిగిన సమావేశంలో అడహక్ కమిటీ సభ్యులు  దేవిదాస్ యాదవ్, ముత్తన్న యాదవ్, కిషోర్ యాదవ్, నారాయణ యాదవ్ లు, ఎన్నికల అధికారి న్యాయవాది వెంకటేష్  ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కవాటి హనుమంతు యాదవ్ , సెక్రెటరీ గా పుప్పాల దేవేందర్ యాదవ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన  నగర అధ్యక్షుడు విగ్నేష్ (విక్కీ )యాదవ్, కార్యదర్శి పుప్పాల దేవేందర్ ల తమను ఎన్నుకున్న నగర సంఘం సభ్యులకు, బాధ్యులకు  ధన్యవాదాలు తెలిపారు. త్వరలో నగర కమిటీ విస్తరణ, ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు.

 

More articles

Latest article