26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రిపోర్టు చేయకుంటే డిగ్రీ సీటు పోయినట్టే

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌

 

దోస్త్‌లో సీటు పొందిన డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ఆన్‌ లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయకపోతే సీటు కోల్పోయినట్టేనని ఉన్నత విద్యామండలి తెలిపింది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రెండో విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ విడుతలో 43,568 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరే కాకుండా మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది బెటర్మెంట్‌ కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని సీట్లు దక్కించుకున్నారు. వీరంతా ఈనెల 18లోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయాల్సి ఉంది. గడువులోగా సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయకపోతే వచ్చిన సీటును కోల్పోయినట్లే. ఆయా సీటును రద్దుచేసి, మరో విడతకు బదలాయిస్తారు. అయితే దోస్త్‌ మొదటి విడతలో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయని కారణంగా 19వేల మంది విద్యార్థులు తమ సీట్లను కోల్పోయారు. ఈ నేపథ్యంలో రెండో విడత సీట్లు దక్కించుకున్న 43వేల మంది గడుడులోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తప్పనిసరిగా చేయాలని ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి సూచించారు.

More articles

Latest article