రిపోర్టు చేయకుంటే డిగ్రీ సీటు పోయినట్టే

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌   దోస్త్‌లో సీటు పొందిన డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులు ఆన్‌ లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌ చేయకపోతే సీటు కోల్పోయినట్టేనని ఉన్నత విద్యామండలి తెలిపింది. డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌) రెండో విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ విడుతలో 43,568 మంది విద్యార్థులు సీట్లను దక్కించుకున్నారు. వీరే కాకుండా మొదటి విడతలో సీట్లు పొందిన వారిలో 6,077 మంది బెటర్మెంట్‌ కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొని సీట్లు దక్కించుకున్నారు. వీరంతా ఈనెల 18లోగా ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్ట్‌...