బతుకమ్మ, భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఎంపి పి ఎస్ పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించామని ఎంఈఓ రాజగంగారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు పెంచే లక్ష్యంగా ప్రతి ఏటా విద్యాశాఖ బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలిపారు. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారని వారు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. బడి బాట కార్యక్రమంలో 35 మంది విద్యార్థులను చేర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి, ప్రసున్న దేవి, మమత, స్వామి, సిద్ధ రాములు, కుమార్, లత విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

