26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా సీతక్క

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియాస్ సీతక్క నియమితులయ్యారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఎవరికీ దక్కలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావ్ కు జిల్లా ఇంచార్జ్ మంత్రి పదవిని అప్పగించారు. ఇటీవల రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లాకు స్థానం దక్కలేదు అయితే రాష్ట్రంలో పలు జిల్లాలకు ఇంచార్జ్ మంత్రులను మార్చగా ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లా బాద్యతలను అప్పగించారు.

More articles

Latest article