- సంయుక్త జిల్లాల నాయకులు కే.రాజేశ్వర్
సిరికొండ, బతుకమ్మ : ఈ నెల 21, 22 తేదీల్లోజిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ట్రేడ్ యూనియన్ సెంటర్ అఫ్ ఇండియా (టీ యు సీ ఐ)రాష్ట్ర ప్రథమ మహా సభలను, ఈనెల 19న జిల్లాలోని సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించతలపెట్టిన టీ యు సీ ఐ నిజామాబాద్, కామారెడ్డి సంయుక్త జిల్లాల ప్రథమ మహా సభలను విజయవంతం చేయాలని టీయుసీఐ సంయుక్త జిల్లాల నాయకులు కే. రాజేశ్వర్ కోరారు.బుధవారం ఆయన భీమ్ గల్ మున్సిపల్ కార్యాలయం వద్ద టీ యు సీ ఐ మహా సభలను విజయవంతం చేయాలని ముద్రించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న 44 చట్టాల్లో 15 చట్టాలను అడ్రాస్ లేకుండా చేయడమే కాకుండా,29 చట్టాలను, నాలుగు లేబర్ కోర్టుగా విభజించి యజమానికి అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా చేయడం సరైనది కాదాన్నారు.1886లో దేశవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పని దినం కోసం పోరాటం చేసి సాధించుకుంటే,ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం 10 గంటల నుంచి 12 గంటలకు పెంచడం సరైంది కాదని అన్నారు.కోటుప చట్టాన్ని రద్దు చేసి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కార్మిక చట్టాలను అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసి వారికి పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని,అట్లాగే ప్రమాద బీమా వర్తించే విధంగా చేయాలని,బీడీ కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పించాలని, రోజుకు 1000 బీడీలు పని ఇవ్వాలని,ఈ బీడీలకు సరిపోయినంత మంచి తునికాకు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓంకార్, రాజన్న, మనోహర్, చిన్న రాజన్న, గంగాధర్, గంగక్క, లక్ష్మక్క, రాజవ్వ మున్సిపల్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.
