27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

రైల్వే గేట్ కీపర్ ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

నవీపేట్, బతుకమ్మ : నవీపేట్ మండలం మహంతం రైల్వే గేట్ కీపర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. విజయేంద్ర కుమార్ భైరవ అనే వ్యక్తి నవీపేట్ మండలంలోని మహంతం రైల్వే గేట్ కీపర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవలే విజయేంద్ర కుమార్ కు నిశ్చితార్థం జరిగింది. సోమవారం ఉదయం విధులు నిర్వర్తించి అనంతరం ఉరేసుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రకి తరలించారు. నిశ్చితార్థం జరిగిన పెళ్లి ఇష్టం లేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article