25.5 C
Hyderabad

సకల సౌకర్యాలతో విద్యా బోధన

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: ప్రభుత్వ పాఠశాలల్లో సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడే విధంగా సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పడం జరుగుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్ అన్నారు. ఉచిత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, మధ్యాహ్న భోజనం, క్రీడలకు ప్రాముఖ్యత, ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధతో చదివించడం, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర విషయాల్లో ప్రతి విద్యార్థికి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article