మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండల బిజెపి ఓబీసి మోర్చా అధ్యక్షుడిగా ముల్లంగి గ్రామానికి చెందిన భూరోల్ల ధర్మపతి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మామిడిపల్లి గ్రామంలో వంజరి సంఘంలో బిజెపి నాయకులు ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నియామక పత్రాన్ని భూరోల్ల ధర్మపతికి అందజేసి బాధ్యతగా పార్టీ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కులాకర్ణి అనిల్, ఉప్పడ గంగారెడ్డి, మదనపల్లి ఒడ్డెన్న, సత్యనారాయణ గౌడ్, రత్నాకర్, సురేష్. ముదారి రాజేశ్వర్, ప్రవీణ్ రెడ్డి, అశోక్ నాయక్, బోడీకే శ్రీనివాస్, పట్టేవార్ రాజు, గల్వే గంగాధర్, రాజేందర్ రెడ్డి, సంజీవ్, లక్ష్మణ్, రాజ, నరేందర్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
