24 C
Hyderabad
Sunday, August 2, 2026

గుమ్మిర్యాలలో బడిబాట కార్యక్రమం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల; జడ్పిహెచ్ఎస్  గుమ్మిర్యాల్ పాఠశాల లో బడిబాట కార్యక్రమానిన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల తహశీల్దార్ మల్లయ్య పాఠశాల పాంఫ్లెట్  బ్రోచర్ ఆవిష్కరించారు.  మండల తాసిల్దార్ మాట్లాడుతూ బడిబాట లో విద్యార్థుల సంఖ్యను పెంచి , ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో బోధన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు అన్ని రంగాల్లో ముందుండేలా కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారి బి.ఆనంద్ రావు, మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అన్ని పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేలా సకల సౌకర్యాలు కల్పిస్తుందని అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల,అంగన్ వాడి పాఠశాల, ఉపాధ్యాయులు,గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article