23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

భూసమస్యలు పరిష్కరానికే భూ భారతి

Must read

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం

నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ :  బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి తో భూముల సమస్యలు పెరిగిపోయాయని, వాటిని పరిష్కరించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తెచ్చిందని నిజామాబాదు ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని అమ్రాబాద్ లో బుధవారం జరిగిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అధికారులకు అందజేశారు.  అనంతరం గంగారెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  విస్తీర్ణం,  పేర్లలో మార్పులు,  చేర్పులు ఉన్న వారు సదస్సుల్లో దరఖాస్తులు అందించాలని సూచించారు. కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. కార్యక్రమంలో  తహసీల్దార్ రామేశ్వర్, పార్టీ మండల అధ్యక్షుడు ఎల్లోళ్ల సాయిరెడ్డి,  నాయకులు రాజేష్,  ముత్యం రెడ్డి,  ఈదుళ్ల సాయిలు, ఈశ్వర్ నాయక్,  డాన్ శీను, పెద్దోళ్ల సాయిరెడ్డి,  ఏరా సాయిలు,  కాంతి సుమన్,  గ్రామస్తులు,  నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article