23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

బనకచర్ల ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదు ?

Must read

📰 Generate e-Paper Clip

తెలంగాణ నీళ్లను ఏపీకి తరలించుపోతున్నారు

కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు

కాళేశ్వరం కమిషన్ కాదు… కాంగ్రెస్ కమిషన్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకించడం లేదని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.  కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం హైదరాబాద్ లోని ఇందిరా పార్కు వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారన్నారు.  కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని,  తెలంగాణ భూములకు నీళ్లు ఇవ్వడం కేసీఆర్ చేసిన తప్పా, ? ,తెలంగాణను అభివృద్ధిలో నెంబర్ వన్ గా నిలబెట్టడం తప్పా  అని కవిత ప్రశ్నించారు.  కాళేశ్వరం కమిషన్ కాదు… అది కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలే కాదని,  ఆ ప్రాజెక్టులో 21 పంప్ హౌజ్ లు, 15 రిజర్వాయర్లు, 200 కి.మీ. మేర టన్నెల్ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1500 కిలోమీటర్ల మేర కాలువలు ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తిపోసిన మట్టితో దాదాపు 300 పిరమిడ్లు కట్టవచ్చన్నారు.  కాళేశ్వరంలో వాడిన స్టీల్ తో 100 ఐఫిల్ టవర్లు కట్టవచ్చన్నారు.  కాళేశ్వరంలో పోసిన కాంక్రీట్ తో 50 బూర్జు ఖలీఫాలు కట్టవచ్చన్నారు.  కాంగ్రెస్ పార్టీ నాయకులకు కలలో కూడా అంతపెద్ద ప్రాజెక్టును కట్టాలన్న ఆలోచన రాదన్నారు. కాళేశ్వరం… ప్రాజెక్టు పూర్తయితే 35 శాతం తెలంగాణ భూభాగానికి నీళ్లు అందిస్తుందన్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలని కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం అని అన్నారు. కేసీఆర్ బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని విమర్శించారు.  గతంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తూ 90 శాతం పనులను మెఘా కృష్ణా రెడ్డి కంపెనీకి ఇచ్చారన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో 15 పంప్ హౌజ్ పనులు చేసిన మెఘా కృష్ణా రెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డికి లేకపోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నందున జలదోపిడి చేసినా రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నించడం లేదన్నారు. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమీ తేవడం లేదన్నారు. గోదావరి ‌ – పెన్నా అనుసంధానం పేరిట నీళ్లు తరలింపును తక్షణమే అడ్డుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొచ్చే బాధ్యతను కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలన్నారు.  గోదావరి నీటిలో వెయ్యి టీఎంసీల హక్కును సాధించే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు. మంచిర్యాల, రామగుండం ప్రాంతంలో ధర్నాకు వస్తున్న జాగృతి కార్యకర్తలను అరెస్టు చేశారని మండిపడ్డారు. ధర్నాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్ లో ధర్నా చేయనివ్వకపోతే జిల్లాల్లో, గల్లీల్లో ధర్నా చేస్తామని కవిత హెచ్చరించారు. కార్యక్రమంలో జాగృతి కార్యకర్తలు ఉన్నారు.


Why is Revanth Reddy not opposing the Banakacharla project?

More articles

Latest article