26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని లింగపూర్ గ్రామం లొ నిరుపేద  కుటుంబానికి చెందిన మాదిగి సాయవ్వ సోమవారం మృతి చెందింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, గౌరారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ ఇమ్మడి లక్ష్మి వారి కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కోసం 5000 ఐదు వేయిల రూపాయలు అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులు మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో నిరుపేదలకు అండగా నిలవడం తన అదృష్టంగా భావిస్తానని మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అన్నారు. ఈ కార్యక్రమంలో తోగారి సాయిలు, బైకం నరేష్, గొల్ల రాజు, సుధీర్, గ్రామ యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article