28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పశువుల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్

Must read

📰 Generate e-Paper Clip

 రెంజల్, బతుకమ్మ:

రెంజల్ మండలం సాఠాపూర్ , బోర్గాం గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తనిఖీలు చేశారు. పశువుల కొనుగోలుకు సంబంధించినటువంటి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది. పశువులలో ఆవులను తరలించితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిజామాబాద్ సిపి తో పాటు బోధన్ ఏసీపి శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు ఉన్నారు.

Police Commissioner inspects cattle purchasing centers

More articles

Latest article